బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (19:08 IST)

చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం - 40 గుడిసెలు దగ్ధం

కొత్త సంవత్సరానికి కొన్ని రోజుల ముందు హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 40కి పైగా గుడిసెలు కాలిబూడిదయ్యాయి. ఫుట్‌పాత్‌కు సమీపంలో వేసుకునివున్న గుడిసెల్లో ఓ గుడిసెలో నుంచి మటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ మంటల ధాటికి గుడిసెల్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు కూడా పేలాయి. 
 
దీంతో గుడిసెల్లో ఉన్నవారితో పాటు.. సమీపంల ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా భయంతో వణికిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ఈ మంటలను ఆర్పివేసేందుకు మొత్తం ఐదు ఫైరింజన్లు ఉపయోగించారు. ప్రమాదం వల్ల ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం వాటిల్లింది.