శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 నవంబరు 2023 (16:40 IST)

ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్‌లొద్దు.. జీహెచ్ఎంసీ వార్నింగ్

tankbund
ట్యాంక్ బండ్‌పై కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి జీహెచ్ఎంసీ స్వస్తి పలికింది. కేక్ కట్ చేసిన తర్వాత ఇతర వ్యర్ధాలు తీసి వేయకుండా అక్కడే పడవేసి వెళ్తుండటంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా ట్యాంక్ బండ్‌పై పుట్టిన రోజు, ఇతర వేడుకలు నిర్వహించకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. 
 
ట్యాంక్ బండ్‌పై కేక్ కటింగ్ నిషేదం.. ఒకవేళ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటా భారీ జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్, ఇతర వేడుకల ముసుగులో వ్యర్థాలను వేస్తే.. సీసీ కెమెరాల నిఘాతో పట్టుకొని జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు