గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:45 IST)

తెలంగాణాలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 8 గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్‌ అలర్డ్‌ ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. 
 
గత రెండు రోజులుగా నగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచి జీడిమెట్ల, లింగంపల్లి, మేడ్చల్, మల్లాపూర్, ఘట్ కేసర్, ఎల్బీనగర్, చంపాపేట్, ఛార్మినార్, చంద్రాయణగుట్ట, ఆరంఘర్ చౌరస్తా, శంషాబాద్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో వాతారవరణ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ ప్రాంతానికి రెడ్ అలెర్ట్‌ ప్రకటించారు. మరో 8 రోజులు పాటు వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
ఇక బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నగరంలో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. దీంతో జీహెచ్ ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరమ్మతులు చేపట్టారు.