ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:39 IST)

పోలీసులపైకి కుక్కలతో దాడి చేయించిన డ్రగ్స్ ముఠా .. ఎక్కడ?

drugs
భాగ్యనగరం డ్రగ్స్ ముఠాకు అడ్డాగా మారిపోయింది. మాదకద్రవ్యాల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అనేక విధాలుగా అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. కానీ, డ్రగ్స్ ముఠా మాత్రం గుట్టుచప్పుడుకాకుండా తమ వ్యాపార దందాను కొనసాగిస్తూనే వుంది. 
 
తాజాగా డ్రగ్స్ దందాపై పక్కా సంచారంతో డ్రగ్స్ ముఠాపైకి పోలీసులు దాడికి యత్నించారు. అయితే, పోలీసుల రాకను పసిగట్టిన డ్రగ్స్ ముఠా వారిపైకే కుక్కలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ కుక్కల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. 
 
కాగా, డ్రగ్స్ ముఠా డార్క్ నెట్ వెబ్ ద్వారా అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలిసులు దాడి చేసి ఇద్దరు సప్లయర్స్‌, ఆరుగురు పెడ్లర్లను అరెస్టు చేశారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించే నరేంద్ర నారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.