ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (11:07 IST)

హైదరాబాదులో 8వేల సీసీటీవీ కెమెరాలు..

cctv
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలో భద్రతను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తన అధికార పరిధిలో CCTV కెమెరా నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా నగరంలో భద్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతోంది జీహెచ్ఎంసీ. కసరత్తులో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో రూ.19.18 కోట్లతో 8వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ ప్రతిపాదిస్తోంది.
 
ఈ కెమెరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, పోలీసులు నిర్ణయించారు. ఈ వారం జరిగే జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కెమెరాల ఏర్పాటు ప్రతిపాదనను ఉంచనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
 
ఇందులో భాగంగా ఫేజ్-Iలో మురికివాడలు, పార్కుల్లోని వ్యూహాత్మక ప్రదేశాలలో కెమెరాలు అమర్చబడతాయి, దీని కోసం CCTVల ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమీషన్‌తో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (O&M) కోసం ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL)కి రెండు సంవత్సరాల పాటు కాంట్రాక్ట్ ఇవ్వబడింది.  
 
ఇప్పటికే EESL ప్రయోగాత్మకంగా జూబ్లీహిల్స్ మరియు బంజారాహిల్స్‌లోని మురికివాడలలో 11 CCTV కెమెరాలను ఏర్పాటు చేసింది. దాని తర్వాత కొత్త కెమెరాలను అమర్చడానికి కాంట్రాక్ట్‌ను పొందింది.