శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (13:20 IST)

హైదరాబాద్‌లో దారుణం : స్నేహితుడిని హత్య చేసిన ఫ్రెండ్స్

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మధుసూదన్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త దారుణ హత్యకు గురయ్యారు. ఈయన్ను స్నేహితులే కిడ్నాప్ చేసి చంపేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈయన వద్ద ముగ్గురు మిత్రులు రూ.40 లక్షలు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బు తిరిగి చెల్లించాలని పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో ఈ నెల 19వ తేదీన మధుసూదన్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. 
 
కిడ్నాప్ చేసిన తర్వాత సంగారెడ్డికి తీసుకెళ్లి అక్కడే హత్య చేసి పూడ్చిపెట్టారు. ఈ కేసులోని ప్రధాన నిందితులుల్లో ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.