ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (17:09 IST)

భాగ్యనగరిలో మహిళ దారుణ హత్య

హైదరాబాద్ నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. 
 
నిజానికి రాజమణి (48) అనే మహిళ మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిర్వహిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్ పేట దగ్గర రాజమణి మృతదేహాన్ని పాతిపెట్టినట్టు విచారణలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించేందుకు సిద్ధమవుతున్నారు.