శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: బుధవారం, 4 సెప్టెంబరు 2019 (19:22 IST)

చెన్నైలో సాంబార్-ఇడ్లీ తింటూ జీవితం లాగించేస్తా: గవర్నర్ నరసింహన్

రెండు తెలుగు రాష్ట్రాల్లోను గవర్నర్ నరసింహన్ బాగా సుపరిచితులే. మరీ గవర్నర్ తెలియకుండా పోవడమేంటి అనుకోకండి. గవర్నర్ నరసింహన్ ఎప్పుడూ ప్రత్యేకతే. ఒకటి రెండు కాదు ఏకంగా పదేళ్ళు ఇక్కడే పని చేశారు. అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేయడం.
 
రాష్ట్రం విడిపోయే సమయంలో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి ఆ తరువాత బిజెపి ప్రభుత్వంలోను పెద్దల అండదండలతో గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు నరసింహన్. అయితే బిజెపిని బలోపేతం చేసేందుకు బిజెపి పావులు కదపడం ప్రారంభించింది. ముఖ్యంగా ఎపిలో కొత్త గవర్నర్ బిశ్వభూషన్‌ను తీసుకుంది.
 
ఆ పేరు ప్రకటించిన కొన్ని రోజులకు తాజాగా తెలంగాణాకు తమిళనాడు బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న సౌందర్ రాజన్‌ను ప్రకటించింది. ముఖ్యంగా తెలంగాణాలో రెండవ స్థానంలో ఉన్న బిజెపిని పటిష్టపరిచి ఆ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయాలన్నది అమిత్ షా ఆలోచన. అందుకే సౌందర్ రాజన్‌ను ఎంచుకుని మరీ ఆ రాష్ట్రంలోనియమించారు.
 
అయితే ఇక్కడే నరసింహన్ గురించి ఎక్కువగా ప్రస్తావించాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ బాధ్యతల నుంచి తొలగిస్తుండటంతో మీడియాతో మాట్లాడారు నరసింహన్. సర్.. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు నరసింహన్.
 
ఇప్పటివరకు నాకున్న గౌరవం వేరు. అయితే నేను గవర్నర్‌గా ఉన్న సమయంలో రోడ్డు పైకి వెళ్ళి ఇడ్లీ-సాంబార్ తినాలనుకునేవాడిని. కానీ నేను తినలేనుగా. అలాగే సామాన్యుడిలా ఉండాలనుకునేవాడిని. ఆ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్. కాబట్టి నేను అనుకున్నవన్నీ చేస్తాను. ఇక సామాన్యుడిలాగే నా జీవితాన్ని సాగిస్తానంటూ చెప్పారు నరసింహన్. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసింహన్‌ను గవర్నర్ బాధ్యతల నుంచి బిజెపి అధినాయకత్వం తొలగించడం మాత్రం చర్చకు దారితీస్తోంది.