శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 11 నవంబరు 2018 (19:51 IST)

14న నామినేషన్ వేస్తున్న... ఎవరూ రావద్దు... గజ్వేల్‌లో కేసీఆర్

గజ్వేల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేత‌లు, కార్యకర్తలతో ఈరోజు కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... గజ్వెల్ నియోజకవర్గంలో గ్రామా ప్రణాళికలు వేసి, మళ్ళీ నాలుగేళ్ల నాటికి రూపురేఖలు మార్చాలి. పేదరికానికి కులం లేదు... అది అందరిని దహించి వేస్తోంది. అన్ని కులాల్లో పేదరికం ఉన్నది.. దళిత వర్గాల్లో, బీసీ వర్గాల్లో ఎక్కువగా, మిగతా కులాల్లో కాస్త త‌క్కువుగా ఉంది.
 
వెయ్యి ఏండ్లు ఎవరూ బ‌త‌కరు.. ఉన్న సనయంలో ఉన్నత లక్ష్యాల కోసం పని చేయాలి. రాష్ట్రం కోసం పని చేయడంలో ఎక్కువ సమయం కేటాయించిన... వచ్చే టర్మ్‌లో గజ్వెల్‌కు కూడా కొంత సమయం కేటాయిస్తానని ప్రామిస్ చేస్తున్న అన్నారు.
 
 దేశంలో తెలంగాణ ధనిక రాష్ట్రం.. 17.17 వృద్ధి రేటుతో ముందుకు పోతున్నము. దేశంలో చాలా రాష్ట్రాలు ఇందులో సగం కూడా లేదు. ఇది వట్టిగా రాలేదు.. కడుపు కట్టుకోవాలి.. అవినీతిని రూపుమాపాలి.. అహర్నిశలు శ్రమించాలి. విమర్శించే వాళ్ళను ప్రశ్నించండి. మంచినీటి పథకం అంటే గతంలో ఆడో బోరు.. ఈడో బోరు అంటే.. ఇప్పుడు మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా నీరు వస్తుంది. 
 
ఈ నీళ్లు 200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి నీళ్ళు ఇస్తున్నాం. రాష్ట్రంలో 20 వేల గ్రామాల్లో పూర్తయింది.. మరో 15 రోజుల్లో 3 వేల గ్రామాల్లో పూర్తి కానుంది అని తెలియ‌చేసారు.
 
 మన నెక్స్ట్ టార్గెట్ పేదరిక నిర్మూలన. అన్ని వర్గాల్లోనూ పేదరికాన్ని పారద్రోలాలి. రేపు గజ్వెల్‌ను చూడటానికి దేశం, గజ్వెల్ నియోజకవర్గం స్వావలంబన సాధించిన నియోజకవర్గంగా మారాలి. అలా మారాలంటే కమిట్మెంట్, కన్విక్షన్ ఉండాలి. ఎన్నికల తరువాత
 ఇంకో 70 వేల కోట్లను ఖర్చు చేస్తే కోటి ఎకరాల తెలంగాణ అయితది. 
 
ఇది పూర్తయితే 10 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి సిస్టమ్ అమలు చేస్తాం.. ఆ పైలెట్ ప్రాజెక్టును గజ్వెల్ నుంచే మొదలుపెడతాం. మహిళల కోసం కూడా నా మనసులో మంచి ఆలోచన ఉన్నది అన్నారు.
 
లిజ్జత్ పాపాడ్ ముంబాయి లోని ఓ మురికి కాలనిలో ఓ మహిళ సంఘం ప్రారంభించింది.. ఇప్పుడు దాని టర్నోవర్ వెయ్యి కోట్లు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో మహిళలకే ప్రాధాన్యత ఉంటుంది. ఎన్నికల నిబంధనలు మనమంతా పాటించాలి. అన్ని నియోజకవర్గాల్లో ఒక అబ్జర్వర్ ఉంటే సీఎం నియోజకవర్గానికి ఇద్దరు ఉంటారు. 14న నామినేషన్ వేస్తున్నా.. ఎవరూ రావద్దు.. 10 మందిమి కలిసి వెళ్లి వేస్తాను. చివర్లో భారీ ఎత్తున పబ్లిక్ మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పారు.