ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (22:00 IST)

తెరాసకు మరో బిగ్ షాక్ తగలబోతుందా? మాజీమంత్రి జూపల్లి పార్టీ మారుతున్నారా?

తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెరాస అధిష్టానానికి షాకివ్వబోతున్నారా అంటే అవుననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన తెరాస కార్యక్రమాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భాజపాలో చేరుతారనే వార్తలు వచ్చాయి.

 
వీటికి బలం చేకూర్చేవిధంగా శుక్రవారం నాడు ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ పట్టణంలో పర్యటించారు. ప్రజల్లో కలియతిరుగుతూ తన రాజకీయ జీవితంపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కార్యకర్తలు, ప్రజల సలహాలు, సూచనలతో ముందడుగు వేస్తానని తెలియజేసారు.

 
జూపల్లితో పాటు పలువురు కిందిస్థాయి నాయకులు కూడా ఆయనతో పాటు భాజపాలో చేరుతారని జోరుగా చర్చ జరుగుతోంది. మరి జూపల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.