ట్రంప్ కూతురు ఇవాంకా ఆ రోడ్డుపై వస్తే బావుండన్న సింగర్ సునీత

శుక్రవారం, 24 నవంబరు 2017 (20:23 IST)

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ. అదే ఇవాంకా ట్రంప్ పైన. ఇప్పటికే ఇవాంకా ట్రంప్ గురించి రాంగోపాల్ వర్మ ట్వీట్లపై ట్వీట్లు చేస్తుండగా గాయని సునీత ఓ సెటైర్ వేశారు. హైదరాబాద్ నగరంలో ఇవాంకా ట్రంప్ ప్రయాణించే రోడ్లు తళతళ మెరిసిపోతున్నాయనీ, ఇవాంకా ట్రంప్ హైదరాబాదులోని రాయదుర్గం టు ఖాజాగూడ రోడ్డులో రావడంలేదేమో.... వస్తే బావుంటుందంటూ ఆమె ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. 
Ivanka-Sunitha
 
దీనిపై నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్ చేస్తూ సునీతకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. కాగా ఇవాంకా ట్రంప్ రాక సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆమె ప్రయాణించే రోడ్లను లక్షల రూపాయలతో ఆధునీకరించి మెరుపులు దిద్దారు అధికారులు. ఆ రోడ్లు మాత్రమే అలావుండి మిగిలిన రోడ్లు గతుకులమయంగా వుండటంపై ఇప్పటికే నగరవాసులు చిర్రుబుర్రులాడుతున్నారు. కొందరు ఇలా సెటైర్లతో చురకలు అంటిస్తున్నారు. మరి కేసీఆర్ నగరంలోని అన్ని రోడ్లను ఇవాంకా ప్రయాణించే రోడ్ల మాదిరిగా చేస్తారేమో చూడాలి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బావిలో దూకేసిన నలుగురు ఇంటర్ ఫస్టియర్ అమ్మాయిలు

ఈమధ్య కాలంలో అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే ప్రాణాలను ...

news

డోక్లామ్‌లో చైనా కలకలం: 400 మీటర్ల పొడవైన గోడ నిర్మాణం

డోక్లామ్‌లో మళ్లీ చైనా కలకలం రేపింది. డోక్లామ్‌ సమీపంలో సొరంగాలు, బ్యారక్‌ల వంటి భారీ ...

news

సెల్ఫీ కోసం ఏనుగు వద్దకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు (వీడియో)

స్మార్ట్ ఫోన్ల పుణ్యమాని.. సెల్ఫీల కోసం సాహసాలు చేసే వారు అధికమవుతున్నారు. సెల్ఫీలకు ...

news

పోసాని అలా చెప్పడంతో టిఆర్ఎస్‌లోకి నటుడు సంపూర్ణేష్ బాబు

సినీనటుల రాజకీయ రంగప్రవేశం కొనసాగుతోంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ...