Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పార్టీని గెలిపించిన వారే బాహుబలి అవుతారు: రేవంత్ రెడ్డిని అవమానించిన జానారెడ్డి?

గురువారం, 2 నవంబరు 2017 (17:57 IST)

Widgets Magazine
k janareddy

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. కొడంగల్ ప్రాంతానికి చెందిన నేతలు రేవంత్ రెడ్డి కాంగ్రె‌స్‌లో చేరడంపై అసంతృప్తితో వున్నప్పటికీ వారికి టిక్కెట్లు ఇచ్చే దిశగా పార్టీ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 
గతంలో తమ పార్టీలోకి ఓ బాహుబలి వస్తారని వ్యాఖ్యానించిన జానారెడ్డి.. ప్రస్తుంత రేవంత్ పార్టీలో చేరడంపై స్పందించారు. తమ పార్టీలో చేరగానే ఎవరూ బాహుబలి కారని, పార్టీని గెలిపించిన వారే నిజమైన బాహుబలి అనిపించుకుంటారని వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరికను తాము స్వాగతిస్తున్నామని రఘువీరా తెలిపారు. ఆయన తమకు బయటి వ్యక్తి కాదని, మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి స్వయానా అల్లుడు అని చెప్పుకొచ్చారు. 
 
కాగా..  తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలోని నివాసంలో కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. రేవంత్‌కు మూడు రంగుల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్‌తోపాటు మరికొందరు నేతలకు కూడా రాహుల్‌ కండువాలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. 
 
అయితే జానారెడ్డి రేవంత్ రెడ్డి అవమానించారని.. పార్టీలో చేరినంత మాత్రాన ఎవ్వరూ బాహుబలి కాలేరని.. పార్టీని గెలిపించే సత్తా వుండాలనే విషయాన్ని రేవంత్ రెడ్డికి వుండాలనే విషయాన్ని గుర్తు చేసేందుకు అలాంటి వ్యాఖ్యలతో పరోక్షంగా దెప్పిపొడిచారని రాజకీయ పండితులు అంటున్నారు. మరి పార్టీలో చేరిన గంటల్లో మొదలైన సీనియర్ల అసంతృప్తి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కర్ణాటకలో ఉండాలని వుందా.. అయితే కన్నడ నేర్చుకోవాల్సిందే!

కర్ణాటక రాష్ట్రంలో ఉండాలనుకునేవారు ఖచ్చితంగా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర ...

news

కమల్ హాసన్‌కు పిచ్చిపట్టింది.. మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి : బీజేపీ

దేశంలో హిందూ ఉగ్రవాదులు పెరిగిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన సినీ హీరో కమల్ హాసన్‌పై భారతీయ ...

news

రిప్డ్‌ జీన్స్‌ వేసుకునే యువతులపై రేప్ చేయడం జాతీయ బాధ్యత.. ఎవరు?

మహిళలపై వేధింపులు, అత్యాచారాలు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎక్కువైపోతున్నాయి. మహిళలను ...

news

గ్వాంటనామా బే జైలుకు తరలించండి : డోనాల్డ్ ట్రంప్

న్యూయార్క్ మ్యాన్‌హాట్టన్ ప్రాంతంలో ట్రక్కుతో పాదచారులు, స్కూలు పిల్లలను తొక్కించి ...

Widgets Magazine