శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2016 (15:23 IST)

హైదరాబాద్‌ ఓ 'కంపు నగరం' : తెలంగాణ మంత్రి జూపల్లి

హైదరాబాద్ నగరం ఓ కంపు నగరం. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. పలువురి నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ కంపు నగరంగా మారిందని ఆయన కొద్దిసేపటి క్రితం పేర్కొన్నారు. 2019 నాటికి నగరానికి కొత్త రూపు ఇవ్వనున్నామని... ఇందులో భాగంగా పలు కీలక చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
 
నిజానికి భాగ్యనగరి హైదరాబాదుకు విశ్వవ్యాప్తంగా మంచి పేరుంది. చారిత్రక నగరంగానే కాక హైటెక్ నగరంగానూ హైదరాబాద్ ప్రశంసలందుకుంటోంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజాలు తమ కార్యక్షేత్రాలను క్రమంగా హైదరాబాదులో ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు తమ కేంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయగా, త్వరలోనే మరిన్ని ఏర్పాటు కానున్నాయి. ఇంతటి ప్రాధాన్యమున్న భాగ్యనగరిని కంపు నగరంగా అభివర్ణించడంపై పలువురు తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.