బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (14:10 IST)

బీఆర్ఎస్ నుంచి నేతలు జూపల్లి - పొంగులేటి సస్పెన్స్

ponguleti - jupalli
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఇద్దరు సీనియర్ నేతలపై సస్పెన్షన్ వేటుపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం వెలువరించినట్టు కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, తనను పార్టీ సస్పెన్షన్ వేటువేయడంపై జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తనను సస్పెండ్ చేసినట్టు వినగానే పంజరంలో నుంచి బయటపడిన చిలుకలా అనిపించిందని అన్నారు. ఇన్నాళ్లూ తాను పార్టీలో ఉన్నట్టా లేనట్టా అని అడిగారు. నేనైతే పార్టీలో ఉన్నట్టు ఎక్కడా చెప్పలేనని, ఇపుడు తనను సస్పెండ్ చేశామంటున్నారు. 
 
కాబట్టి ఇప్పటివరకు పార్టీలోనే ఉన్నట్టు తెలిసిందని అన్నారు. పైగా, తనను ఎందుకు సస్పెండ్ చేశారో, తాను అడిగిన ప్రశ్నల్లో అబద్ధాలు ఉన్నాయా అని అడిగారు. ఒకవేళ తన మాటలు అబద్ధాలని అంటే నిజా నిజాలు నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు జూపల్లి సవాల్ విసిరారు. తన ప్రశ్నలకు బదులివ్వలేక సస్పెండ్ చేశారని ఆరోపించారు.