1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: గురువారం, 29 అక్టోబరు 2020 (14:48 IST)

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 9న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 728 ఓట్లు రాగా బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 29 ఓట్లు వచ్చాయి.
 
ఉప పోరులో 672 ఓట్ల మెజారిటితో కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. 2014 నుంచి 2019 వరకు లోక్ సభ సభ్యురాలుగా నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కవిత తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో శాసనమండలిలో తన గళాన్ని వినిపించబోతున్నారు.