సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (15:55 IST)

కామారెడ్డిలో దారుణం : బాలికపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

victim
తెలంగాణ రాష్ట్రంలోని  కామారెడ్డిలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడ్డారు. 16 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రమైన గుమస్తా కాలనీకీ చెందిన ఓ బాలిక (16)పై కామారెడ్డి పట్టణానికి చెందిన కిరణ్ అనే సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్యూరిటీ గార్డుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితుడు జిల్లా కలెక్టరేట్‌లో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం.