కేసీఆర్‌తో స్నేహం మంచిదికాదు: జగన్ కు రేవంత్ దిమ్మతిరిగే సలహా

revanth reddy
ఎం| Last Updated: మంగళవారం, 28 జనవరి 2020 (07:44 IST)
కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు అంత మంచిదికాదని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి సూచించారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

పెద్దలసభ రద్దు అనేది సహేతుకమైన చర్యకాదని ఆయన చెప్పారు. బిల్లు ఆమోదం పొందలేదని మండలినే రద్దు చేయడం సరికాదని సూచించారు. ఎన్ని రాజధానులు పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏపీ పరిణామాలు చూస్తే నవ్వాలో, ఏడువాలో అర్థంకావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ స్నేహం వల్లే జగన్‌కు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు.

కేసీఆర్‌తో స్నేహం జగన్‌కు అంత మంచిదికాదని పేర్కొన్నారు. కౌగిలించుకున్న వారందరికీ కేసీఆర్‌ వెన్నుపోటు పొడిచారని చెప్పారు. నేతలకు పట్టుదల ఉండాలి కానీ మొండితనం ఉండకూడదని రేవంత్‌ రెడ్డి సూచించారు.
దీనిపై మరింత చదవండి :