శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (15:19 IST)

బస్సు కాదు గురూ.. బయో టాయిలెట్ బస్సు

బస్సు కాదు గురూ బయో టాయిలెట్టు. మీరు చూస్తున్నది ఆర్టీసీ బస్సు అనుకుంటున్నారా? కాదు. అది బస్సు టాయిలెట్… సారీ.. బయో టాయిలెట్. ఆర్టీసీ కార్మికుల కోసం చేంజ్ ఓవర్ పాయింట్స్‌లో ఇలా సంచార బయో టాయిలెట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. 
 
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆర్టీసీ ఉద్యోగుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై చర్చించిన అనంతరం సిఎం ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు చేశారు.
 
దాంతో సత్వర చర్యలు తీసుకున్న ఆర్టీసీ యాజమాన్యం ఈ బస్సు టాయిలెట్లను రూపొందించింది. మియాపూర్లోని బస్ బాడీ బిల్డింగ్ యూనిట్‌లో దీన్ని తయారు చేశారు. ఇది త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు అందుబాటులోకి రానుంది.