మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (13:09 IST)

ప్రొఫెసర్ హరగోపాల్ మీద పెట్టిన కేసును ఎత్తివేయాలి

kcrao
ప్రొఫెసర్ హరగోపాల్, ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొఫెషర్‌ హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వీరిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ డిజీపీని ఆదేశించారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌పై 2002 ఆగస్టు 19న ములుగు తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఉపా కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. 
 
మొత్తం 10 సెక్షన్ల కింద ప్రొఫెసర్‌తో పాటు, మరో 152 మందిపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా హరగోపాల్‌ పేరు మావోయిస్టు పుస్తకాల్లో ఉందని, ప్రజా ప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని పోలీసులు ఆరోపించిన సంగతి తెలిసిందే.