భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్
భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు సోమవారం ఉదయం బయలుదేరారు. ఆయన వెంట 600 కార్లు బయలుదేరగా, భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రులు హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా, సోలాపూర్ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు మహారాష్ట్రలోని ధారిశివ్ జిల్లాలోని ఒమర్గాకు వీరంతా చేరుకుంటారు. అక్కడ భోజనం చేసిన తర్వాత సాయంత్రం 4.30 గంటలకు సోలాపూర్‌కు బయలుదేరి వెళతారు. రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురంకు చేరుకుని అక్కడి విఠోభార్ముణికి మందిర్‌లో కేసీఆర్, ఇత్ర నేతలు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆ తర్వాత సోలాపూర్ జి్ల్లా సర్కోలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభలోనే ప్రముఖ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు బీఆర్ఎస్‌లో చేరుతారు. ఆ తర్వాత ధారాశివ్ జిల్లాలో కొలువైన తుల్జాభవనీ అమ్మవారి శక్తిపఠంను సందర్శించుకుని హైదరాబాద్ నగరానికి తిరుగు ప్రయాణమవుతారు.