ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (12:17 IST)

తమిళనాడులో సీఎం కేసీఆర్ పర్యటన: ఎం.కె.స్టాలిన్‌తో భేటీ

తమిళనాడులో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. డిసెంబర్ 13వ తేదీ ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ముందుగా శ్రీరంగంలోని రంగనాథ ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
అనంతరం తిరుగు ప్రయాణంలో చెన్నైకి చేరుకుని అక్కడే బస చేస్తారని, డిసెంబర్ 14వ తేదీ మంగళవారం తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవానికి సీఎం స్టాలిన్‌ను ఆహ్వానించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. 
 
అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2010, మే 13వ తేదీన సీఎం కేసీఆర్ శ్రీరంగం వెళ్లి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఎండగడుతున్నారు.