శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (16:53 IST)

విమలక్క పాటకు కాలు కదిపిన జేఏసీ ఛైర్మన్ కోదండరాం!

నల్లగొండ జిల్లా భువనగిరిలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత విమలక్క పాట అందుకోగా, జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం కాలు కదిపారు. విమలక్క పాటకు వేదికపైనే కోదండరాం ఉత్సాహంగా స్టెప్పులేయడంతో తెలంగాణ వాదులు పులకించిపోయారు. నిన్నటివరకు తెలంగాణ ఉద్యమానికి అన్నీ తానై నడిచిన కోదండరాం గంభీరంగానే కనిపించారు. పక్కనే డప్పులున్నా.. డ్యాన్సులు హోరెత్తుస్తున్నా... ఆయన కాలు మాత్రం కదపలేదు. అయితే నల్లగొండలో మాత్రం చిన్నపాటి స్టెప్పులతో కోదండరాం ఆకట్టుకున్నారు. 
 
కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలిదశ ఉద్యమానికి ఉస్మానియా వర్శిటీ ప్రొఫెసర్ అయిన కోదండరాం జీవం పోశారు. టీజేఏసీ పేరిట ఏర్పడ్డ అన్ని సంఘాల ఉమ్మడి సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించిన కోదండరాం, ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. 
 
తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ప్రొఫెసర్‌గా కోదండరాం పదవీ విరమణ చేశారు. అయితే జేఏసీ చైర్మన్‌గా మాత్రం ఆయన విరమణ చేయకుండా బంగారు తెలంగాణ కోసం శ్రమిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల నేపథ్యంలో.. అన్నదాతల దుస్థితి మీద తీవ్ర వేదనను వ్యక్తం చేసి.. తెలంగాణ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ..  రైతులకు భరోసా కల్పించేలా వ్యవహరిస్తున్నారు.