గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (16:38 IST)

చిరుతను అక్కడ పట్టుకున్నారు... ఎక్కడ వదిలారంటే?

leopard
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలోని కాజీపల్లిలోని హెటెరో డ్రగ్స్‌ లిమిటెడ్‌ తయారీ యూనిట్‌లో డిసెంబర్ 16న పట్టుబడిన చిరుతను గురువారం రాత్రి అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో వదిలారు. 
 
సంగారెడ్డిలోని హెటిరో డ్రగ్స్‌ యూనిట్‌లోకి నాలుగేళ్ల మగ చిరుతపులి ప్రవేశించడంతో అటవీశాఖ అధికారులు, జూ అధికారులు చిరుతను పట్టుకున్న విషయం తెలిసిందే. 
 
అధికారులు చిరుతను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలించి మూడు రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచారు. గురువారం అటవీశాఖ అధికారులు ఆ జంతువు ఆరోగ్యంగా ఉందని చెప్పడంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు.