గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:12 IST)

కరోనా వ్యాక్సిన్ వికటించి.. మహిళా సర్పంచ్ మయూరి మృతి

Mayuri
కరోనాకు వ్యాక్సిన్ వికటించి రంగారెడ్డి జిల్లా, షడ్నగర్ నియోజకవర్గం, కేశంపేట మండలం, లింగధానా గ్రామ మహిళా సర్పంచ్ మయురి (42) మరణించారు. ఈ నెల 12 వ తేదీన మయూరి కేశంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా ఆ రోజు నుంచి అనారోగ్యంతో మయూరి బాధపడుతున్నట్లు సమాచారం.
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి అకస్మాత్తుగా పల్స్ పడిపోగా చికిత్స నిమిత్తం హుటాహుటిన మయూరిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అయితే మయూరి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఇక ఈ మృతికి వ్యాక్సిన్ కారణమా? లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి వుంది.