1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 సెప్టెంబరు 2021 (18:49 IST)

మద్యం ప్రియులకు షాక్.. 2 రోజులు షాపులు బంద్.. డీజేలొద్దు.. రూల్స్ ఇవే!

మద్యం ప్రియులకు ప్రభుత్వం షాకిచ్చింది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో రెండు రోజులపాటు నగరంలో మద్యం షాపులు, బార్లు బంద్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఉ.6 నుంచి సోమవారం సా.6 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో మద్యం ప్రియులు నిరాశకు గురవుతున్నారు. 
 
ప్రజలందరు ఆనంధంగా శోభయాత్రలో పాల్గొనడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో యాత్ర జరిగేటప్పుడు ట్రాఫిక్ డైవెర్షన్ ఉంటాయి. కాబట్టి ప్రజలు దానికి అనుకూలంగా సిద్ధం కావాలి అని అన్నారు. పోలీస్ కమిషనర్ కార్తికేయ హైదరాబాద్ నుండి బోధన్- వయా మాధవ్నగర్ బైపాస్ రోడ్డు- కంఠేశ్వర్ అర్పావల్లి -బోధన్ వెల్లవలెను అని తెలిపారు. బోధన్ నుండి హైదరాబాద్- బోధన్ అర్పావల్లి బైపాస్ కంఠేశ్వర్ మాధవ్ నగర్ వెళ్లాలని తెలియజేశారు. బాసర బ్రిడ్జిపై నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ డైవెర్షన్ ఉంటుంది.
 
గణేష్ నిమజ్జనం తర్వాత వాహనాలు బిర్రెల్లి ధర్మాబాద్ కందకుర్తి ద్వారా (లేదా), భైంసా నిర్మల్ ఆర్మూర్ ద్వారా నిజామాబాద్ రావాల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఆంక్షలు తేది 19-09-2021 సాయంత్రం నుండి తేది 20-09-2021 సాయంత్రం 5 గంటల వరకు పెట్టడం జరిగింది. ఆర్.టి.సి బస్సులు హైదరాబాద్ వెళ్ళిటివి బస్టాండ్ ఎన్.టి.ఆర్ విగ్రహం రైల్వే కమాన్ కంఠేశ్వర్ - బైపాస్ రోడ్డు మీదుగా మాదవ గనర్ వైపునకు వెళ్లాలి. 
 
గణపతి విగ్రహాల్ని తీసికొని వెళ్ళే వాహానాలను చెకప్ చేయించుకోవాలి. మధ్యం త్రాగి వాహనాలను నడువరాదు. మద్యం త్రాగి గణేష్ వాహానాలు నడిపే వారిపై అల్కామీటర్ పరీక్షలు జరుపబడును. వారు మద్యం త్రాగివున్నట్లయితే వారిపై క్రిమినల్ చర్యలు తీసికొనబడును. డిజెలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదు. టపాకాయలు కాల్చరాదు.
 
ప్రజలు పోలీసులకు సహకరించి శోభాయాత్ర విజయవంతంగా పూర్తి అయేటట్లు చూడాలి. మహిళలు విలువైన వస్తువులు ధరించకుండా ఉంటే మేలు. ఊరేగింపులో చిన్న పిల్లలు తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.