బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 మార్చి 2023 (10:23 IST)

పదో తరగతి బాలుడితో పారిపోయిన టీచర్

Love
పదో తరగతి చదువుతున్న బాలుడితో అతడికి పాఠాలు చెప్పే టీచర్‌ అదృశ్యమైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని చందానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలో ఓ యువతి (26) టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో  గచ్చిబౌలికి చెందిన బాలుడు (15) పదో తరగతి చదువుతున్నాడు. గత నెలలో వీరిద్దరూ అదృశ్యయ్యారు. 
 
తన మనవరాలు కనిపించడం లేదంటూ ఆమె తాతయ్య చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఆ తర్వాత రెండు రోజులకే ఆమె తిరిగి ఇంటికి రావడంతో కేసును వెనక్కి తీసుకున్నారు. అదే సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 
 
రెండు రోజుల తర్వాత బాలుడు కూడా ఇంటికి చేరుకున్నాడు. ఎక్కడికెళ్లావంటూ బాలుడిని పోలీసులు ప్రశ్నించడంతో వీరిమధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. టీచర్‌తో కలిసి ఈ ఫిబ్రవరి 16న పారిపోయినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.