బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 సెప్టెంబరు 2021 (13:22 IST)

భర్త వేధింపులు.. కోపంతో మర్మాంగం కోసి హత్య

మహబూబ్ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్త మర్మాంగం కోసి హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… మహబూబ్ నగర్ జిల్లా మరిపెడ మండలం తానం చెర్ల రెవెన్యూ పరిధిలోని వాంకుడోతు తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు భర్త వేధింపులే కారణమని తెలిసింది. 
 
తన భర్త భూక్యా బిచ్యా తరచూ మద్యం సేవించి వేధింపులకు పాల్పడుతున్నాడు అని భార్య ప్రమీల ఏకంగా కోపంతో మర్మాంగం కోసి వేసింది. దాంతో భర్త మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.