శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జూన్ 2021 (14:41 IST)

మావోయిస్టు అగ్రనేతలను కాటేసిన కరోనా : జగన్ లేఖ

మవోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ (50)తోపాటు భరతక్క కరోనాతో మరణించారు. 
 
నిజానికి వీర్దదరూ కరోనాతో బాధపడుతూ మృతి చెందినట్లుగా గ‌త నాలుగు రోజులుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఆ పార్టీ స్పందించింది. హ‌రిభూష‌ణ్ మృతిని నిర్ధారిస్తూ ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోష‌ల్ మీడియాలో లేఖ విడుద‌లైంది.
 
తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, దండకారణ్యం మాడ్ డివిజన్ - ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు లేఖలో స్పష్టంచేశారు.
 
హరిభూషణ్ గత కొంతకాలంగా బ్లాంకైటిస్ ఆస్తమాతో బాధపడుతూ వచ్చారు. ఈయన పరిస్థితి విషమించడంతో ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు మృతి చెందాడని, భారతక్క ఈ నెల 22వ తేదీన ఉదయం 9:50 గంటలకు మృతి చెందిందని లేఖలో తెలిపారు.
 
కాగా, వీరిద్దరి అంత్యక్రియలు కూడా మంగళవారం ప్రజల సమక్షంలో జరిపి, వారికి శ్రద్ధాంజలి ఘటించినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. దీంతో హరిభూషణ్ మృతి వార్తపై స్పష్టత వచ్చింది. వీరిద్దరి మృతి మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బలాంటిదే.