సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:43 IST)

చావులోనూ వీడని స్నేహబంధం

వారిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. చిన్నప్పటి నుంచి ఒకరిని విడిచి మరొకరు ఉండలేదు. అలాగా చావులోనూ వారిద్దరూ ఒకటిగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన దుండిగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు కన్నుమూశారు.
 
దుండిగల్‌ పరిధిలోని బౌరంపేట్‌లో ఆగి ఉన్న వ్యాన్‌ను ఓ బైకు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
మృతులను సూరారం ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ రెడ్డి, సైనిరెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.