గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

బ్లాక్ ఫంగస్ కలకలం : కామారెడ్డిలో వైద్యాధికారి మృతి

ఒకవైపు కరోనా వైరస్ భీతి తొలగిపోకముందే.. ఇపుడు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇలాంటి వారిలో పలువురు మృత్యువాతకూడా పడుతున్నారు. ఈక్రంలో తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ దెబ్బకు ఓ వైద్యాధికారి మృత్యువాతపడ్డారు. 
 
కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ గోవర్ధన్‌ను ఈ వైరస్ సోకి చనిపోయారు. ప్రస్తుతం ధర్పల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం హైదరాబాద్‎లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవర్ధన్ మృతి చెందాడు. కాగా, 20 రోజుల క్రితం తన తల్లి కరోనా వైరస్‎తో పోరాడి మృతి చెందింది. తల్లి మృతి చెందిన తర్వాత కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.