గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (07:45 IST)

బైక్ యాక్సిడెంట్ కేసు : సాయిధరమ్ స్పందించడం లేదు.. త్వరలో చార్జిషీట్

బైక్ యాక్సిడెంట్ కేసులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్‌కు పంపిన నోటీసులపై స్పందించడం లేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని వారు తెలిపారు. 
 
దీనిపై సైబరాబాద్ పోలీసీ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, బైక్ ప్రమాదం కేసులో సాయి ధరమ్‌కు నోటీసులు పంపించగా, ఆయన ఇప్పటివరకు స్పందించలేదని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదైవుందని, అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్యూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ సాయి ధరమ్ మాత్రం స్పందించలేదని చెప్పారు. అయినప్పటికీ త్వరలోనే ఆయనపై చార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు. 
 
ఇదిలావుంటే, గత యేడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరాలు, రహదారి ప్రమాదాలకు సంబంధించి ఆయన ఒక వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇందులో ఈ యేడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మరణిస్తే, వీరిలో 80 శాతం మంది తలకు హెల్మెట్లు ధరించక పోవడంతో చనిపోయారని వివరించారు. 
 
అలాగే, 712 రోడ్డు ప్రమాద కేసుల్లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 212 ప్రమాదాలు జరిగినట్టు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుపడిన వాహనచోదకుల నుంచి రూ.4.50 కోట్ల జరిమానా వసూలు చేసినట్టు చెప్పారు. అలాగే, 9981 వాహనచోదకుల లైసెన్సులు రద్దు చేసినట్టు ఆయన వివరించారు.