శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:07 IST)

ట్రంప్ ఆంక్షల్ని అమలు చేయడం అంత సులభం కాదు.. ''టి'' ప్రజల కోసం ఢిల్లీకి వెళ్తా: కేటీఆర్

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వీసా రద్దు, ముస్లింలకు ప్రవేశం లేదు అంటూ దురుసు నిర్ణయాలతో ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలా బ్రేకులెయ్యాలో తెలియ

ప్రపంచ దేశ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. వీసా రద్దు, ముస్లింలకు ప్రవేశం లేదు అంటూ దురుసు నిర్ణయాలతో ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలా బ్రేకులెయ్యాలో తెలియక ఇతర దేశాల ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ట్రంప్ ఆంక్షల అమలు అంత సులభం కాదని.. అందుకు సెనెట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
 
ఇంకా త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని.. అమెరికాలో తెలంగాణవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు అమెరికాలో ఏర్పడే సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రం సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. 
 
శనివారం కలెక్టరేట్‌లో కేటీఆర్‌ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్పొరేషన్‌ పరిధిలో 24 గంటల తాగునీటి సరఫరాకు సంబంధించి త్వరలో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దశలవారీగా మిగతా కార్పొరేషన్లలోనూ 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని హామి ఇచ్చారు. 2018లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. 
 
కాగా అమెరికాలో తెలంగాణ ప్రజల గురించి కేటీఆర్ స్పందించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా తెలుగువారిని డొనాల్డ్ ట్రంప్ ఇబ్బంది పెట్టేస్తున్నారని.. అందుకు ఇక్కడే ఉపాధి అవకాశాలను సృష్టిద్దామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.