శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (09:59 IST)

కరోనా వ్యాప్తిపై దుష్ప్రచారం చేస్తే ఏడాది జైలు

ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనేక సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని.. వాటిని ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని అవాస్తవాలు సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో సాధారణ ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారని ఆయన అన్నారు.

పక్కా సమాచారం లేకుండా వచ్చిన మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయకూడదని ఆయన తెలిపారు. అసత్యాలను  ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. సెక్షన్‌ 54 ప్రకారం ఏడాది వరకూ శిక్షపడే అవకాశముందన్నారు.
 
అమ్మో.... మెట్రో!
కరోనా కలకలం నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. రద్దీ అధికంగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మెట్రో రైలును ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు. ఏసీ మెట్రో రైలు కావడంతో త్వరగా వైరస్‌లు గాలిలో విస్తరించే అవకాశముండడంతో కొంత జంకుతున్నారు.

గతంతో పోల్చితే ప్రతి రోజూ పది వేల మందికి పైగా ప్రయాణికులు తగ్గారని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల బంద్‌ ప్రకటించి ఆంక్షలు విధించడంతో మరింతగా ప్రయాణికులు తగ్గే అవకాశాలున్నాయి.

ఎంఎంటీఎస్‌, వివిధ మార్గాల్లో వెళ్ళే రైళ్లలో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. రద్దీగా ఉండే పలు రైళ్లలోని జనరల్‌బోగీలలో హడావిడితగ్గింది.