శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

తెలంగాణాలో వైన్స్ షాపులు బంద్.. ఎందుకో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయి. పట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్ని‌కలు జరిగే జిల్లాల్లో రెండు రోజు‌ల‌పాటు వైన్స్‌లు, బార్లు, కల్లు దుకా‌ణాలు, క్లబ్బులు మూసి ఉంటా‌యని ఎక్సై‌జ్‌‌శాఖ కమి‌ష‌నర్‌ సర్ఫ‌రాజ్‌ అహ్మద్‌ ఉత్త‌ర్వులు జారీ‌చే‌శారు. 
 
హైద‌రా‌బాద్‌, రంగా‌రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నల్ల‌గొండ, వరం‌గల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరి‌ధిలో శుక్ర‌వారం సాయంత్రం 4 నుంచి ఆది‌వారం సాయంత్రం 4 గంట‌ల‌వ‌రకు మూసి‌వే‌య‌ను‌న్నట్టు తెలి‌పారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 17న ఉదయం నుంచి వైన్స్‌లు మూసి ఉంటా‌యని వివ‌రిం‌చారు.
 
మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్‌ శ్వేతామహంతి తెలిపారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం ఆమె ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటేసేలా చూడాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. 
 
ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతకుముందు శామీర్‌పేట మండలంలోని గోడౌన్‌ను కలెక్టర్‌ శ్వేతామహంతి పరిశీలించారు. గోడౌన్‌ వద్ద బందోబస్తు, బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించారు. బ్యాలెట్‌ పత్రాలు, బాక్సులు, ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన ముందుస్తు జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు.