తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడొస్తాయ్?
నైరుతి రుతుపవనాలు ఈ నెల 5,6 తేదీల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్లేనని.. హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు ఈ నెల 5,6 తేదీల్లో తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్లేనని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి చెప్పారు.
వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెయిన్‌గేజ్ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో రుతుపవనాలు వస్తున్నట్టుగా గుర్తించామని వైకే రెడ్డి తెలిపారు.
రేడియేషన్ తగ్గినప్పుడు రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ప్రకటిస్తామని వైకే రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికి ముందే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని వైకే రెడ్డి చెప్పారు. జూన్ ఐదు నుంచి 8వ తేదీ లోపు తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయని వైకే రెడ్డి తెలిపారు.