నాది రెండు కళ్ల సిద్ధాంతం కాదు.. చంద్రబాబే మా నేత : మోత్కుపల్లి

మంగళవారం, 3 అక్టోబరు 2017 (15:24 IST)

motkupally

గవర్నర్ పదవి వస్తుందని గత మూడేళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. అయితే, తాజాగా కేంద్రం నియమించిన గవర్నర్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైనట్టు చెప్పారు. ఈ కారణంగానే తన కుటుంబ సభ్యలు కన్నీరు పెట్టుకున్నారనీ, పైపెచ్చు దసరా పండుగను కూడా జరుపుకోలేదని ఆయన వాపోయారు. 
 
తెలంగాణాలో మోత్కుపల్లి నర్సింహుల్ సీనియర్ నేత. ఆయనకు గవర్నర్ పదవిని ఇప్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముమ్మరంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకెళ్లగా, ఆయన కూడా సమ్మతించారు. ఇలా చెప్పి మూడేళ్లు గడిచిపోయింది. దీంతో మోత్కుపల్లి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, గవర్నర్ పదవి రాకపోవడంతో నిరాశచెందానని అన్నారు. తన కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకున్నారని ఆయన తెలిపారు. తాను మరింత నిరాశచెందానని ఆయన చెప్పారు. ఆ బాధతో దసరా కూడా చేసుకోలేదని ఆయన అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తనకు నమ్మకం ఉందన్నారు. కనీసం రాజ్యసభ పదవి అయినా వస్తుందని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. 
 
ఇకపోతే.. తెలంగాణాలో టీడీపీ పరిస్థితిపై ఆయన స్పందిస్తూ.. భవిష్యత్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవచ్చు కానీ, కాంగ్రెస్‌తో మాత్రం పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. ఎందుకంటే.. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టీడీపీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. అయితే, ఇపుడు కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరడం బాధ కలిగిస్తోందన్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మళ్లీ మొదటికొచ్చిన ఓపిఎస్ - ఇపిఎస్.. అదీ శ్రీవారి చెంతే..!

అన్నాడిఎంకేలో బద్ధశత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కలిసిపోయారు. దీంతో కథ ...

news

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ చిక్కింది.. ఎక్కడ?

చేపల కోసం వల వేస్తే కొండ చిలువ వలలో చిక్కుకుపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పెదరాయవరం ...

news

డేరా బాబా భర్త కాదు... తండ్రి... చాలా అమాయకుడు : హనీప్రీత్

డేరా బాబా దత్తపుత్రికగా చెప్పుకుంటున్న హనీప్రీత్ ఇన్సాఫ్ ఎట్టకేలకు మీడియా కంటికి ...

news

ముంబై తొక్కిసలాట.. మహిళను అసభ్యంగా తాకుతూ.. దోచుకున్నారు.

మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ముంబై రైల్వే స్టేషన్‌లో బ్రిడ్జి కూలి ...