బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం

మిసెస్ తెలంగాణగా 63 ఏళ్ల బామ్మ

తెలంగాణ-2109 అందాల పోటీల సూపర్ క్లాసిక్ కేటగిరీలో డాక్టర్ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు.

లండన్ లో ప్రఖ్యాత వైద్యురాలిగా శోభాదేవికి గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్ లో వైద్య సేవలు అందించారు.  అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్ వచ్చిన శోభాదేవి హైదరాబాద్ లోని లైఫ్ స్పాన్ ఆసుపత్రిలో డయాబెటాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.

ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు ఏకంగా టైటిల్ ఎగరేసుకెళ్లారు.

ఇంతటి ఘనత సాధించిన శోభాదేవి వయసు 63 సంవత్సరాలు.. ఈ వయసులోనూ అందాల పోటీలలో పాల్లొని అందరి మనసులు గెలుచుకుని టైటిల్ సాధించారు.