గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (12:04 IST)

తెలంగాణాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు... రేపు - ఎల్లుండి మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రత బాగా పడిపోతుంది. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. మెదక్‌లో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈశాన్య భారతం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల రాష్ట్రంలో చలి తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. 
 
సోమవారం రాత్రి మెదక్‌లో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 14.8 డిగ్రీలు, నిజామాబాద్‌లో 17.8 డిగ్రీలు, ఖమ్మంలో 19 డిగ్రీలు, నల్గొండలో 20 డిగ్రీలు, హైదరాబాద్ నగరంలో 17 డిగ్రీలు చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే, రానున్న రెండు రోజుల్లో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.