ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (08:30 IST)

ఐస్ క్రీమ్ కోసం ఫ్రిజ్ తెరిచిన చిన్నారి మృత్యువాత.. ఎలా?

deadbody
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఓ షాపింగ్ మాల్‌లో విషాదం జరిగింది. ఐస్ క్రీమ్ కొనుక్కునేందుకు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన చిన్నారి ఒకరు మృత్యువాత పడింది. ఫ్రిజ్‌లో ఉన్న ఐస్ క్రీమ్‌ను తీసుకునేందుకు డోర్ తీయగానే ఆమెకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని నందిపేట్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు.. బోధన్ నియోజకవర్గంలోని నవీపేటకు చెందిన గూడూరు రాజశేఖర్ ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి నందీపేట్‌కు వచ్చారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు తిరిగి ఊరికెళుతుండగా, కుమార్తె రిషిత (4)ఐస్ క్రీమ్ కావాలని మారాం చేసింది. దీంతో స్థానికంగా ఉండే ఎన్‌మార్ట్‌ మాల్‌కు తీసుకెళ్లారు. 
 
తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. పక్కనున్న మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకుంది. విద్యుదాఘాతానికి గురై అలానే బిగుసుకుపోయింది. కొద్దిసేపటికి గమనించిన తండ్రి హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే పసిపాప బలైందని కుటుంబసభ్యులు చిన్నారి మృతదేహంతో మాల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.