గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (11:42 IST)

తెరాస ఎమ్మెల్యీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత.. ఏకగ్రీవమేనా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస అధినాయకత్వం ప్రకటించింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో ఆమె మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎమ్మెల్సీ కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
ప్రస్తుతం ఆమె స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈమె పదవీకాలం త్వరలోనే ముగియనుంది. దీంతో ఆమెను మరోమారు శాసనమండలికి పంపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 
 
కాగా, గతంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆ స్థానం ఖాళీ కావడంతో అక్కడ నుంచి కవిత ఎమ్మెల్సీగా పోటీచేసి ఎన్నికయ్యారు. ఇపుడు మరోమారు ఆమె మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు.