శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (13:54 IST)

తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తాం.. ఎపుడంటే....

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితులు లేవన్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే మాత్రం రాత్రిపూట కర్ఫ్యూ అవసరమన్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు. కానీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాజిటివిటీ రేటును నిశితంగా పరిశీలిస్తే ఒక్క జిల్లాలోనే ఇది 10 శాతంగా ఉందన్నారు. కరోనా కేసుతో పాటు పాజిటివిటీ రేటు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఈ నెల 31వ తేదీ వరకు ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో మెదక్‌లో 6.45 శాతం, కొత్తగూడెంలో 1.14 శాతం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 4.22 శాతం చొప్పున పాజిటివిటీ రేటు ఉందని ఆయన వివరించారు.