శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (16:20 IST)

రూపాయి నోటుకు బిర్యానీ అని వెళ్తే.. రూ.100 జరిమానా.. ఎందుకు?

Biryani
కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు ఆ హోటల్ యజమాని సూపర్ ఆఫర్ అందించాడు. రూపాయి నోటుకు బిర్యానీ ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఒక్క రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ నగరంలో ప్రచారం చేశారు. ఆ నోట్లను సేకరించి మరీ హోటల్‌కు ప్రజలు క్యూ కట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
 
ఆ హోటల్ ఏరియాలో వందలాది వెహికిల్స్ పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే అక్కడ నో పార్కింగ్‌‌లో పార్కింగ్ చేసిన వెహికిల్స్‌కు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.