గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (17:18 IST)

OU Exams: చివరి సెమిస్టర్ విద్యార్థులకు అలెర్ట్

తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను జూలై మొదటివారంలో జరగనున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరి సెమిస్టర్ విద్యార్ధులు ఈ నెల 22వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాల్సి వుంటుంది.
 
అలాగే రూ. 300 ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు సూచించాయి. పరీక్షల ఫీజు, టైం టేబుల్, ఇతరత్రా విషయాల కోసం విద్యార్ధులు ఓయూ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచించారు.