శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 4 మే 2020 (21:54 IST)

అలా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది: తెలంగాణ మంత్రి పువ్వాడ

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వ్యాక్సిన్‌ వచ్చే వరకు జాగ్రత్తలు తప్పవని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. దీనిపై ప్రజలు అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

సోమవారం ఆయన ఖైరాతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ డ్రైవర్లు, చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, సబ్బులతో కూడిన రూ. ఐదువేల కిట్లను అందచేశారు. లాక్‌డౌన్‌ వల్లే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలుగుతున్నామనీ, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదనీ అన్నారు.

కార్యక్రమంలో పాల్గన్న రవాణాశాఖ కమిషనర్‌ ఎమ్‌ఆర్‌ఎమ్‌ రావు మాట్లాడుతూ.. కరోనా నివారణ కోసం ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. రవాణాశాఖ జాయింట్‌ కమిషనర్లు రమేష్‌, మమతా ప్రసాద్‌, ఓఎస్డీ కృష్ణకాంత్‌, పీఎస్‌ కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గన్నారు.