శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (11:16 IST)

దండం పెడతా.. బయటకు రాకండయ్యా బాబూ

బయట తీరగొద్దు మొర్రో అంటూ ఎంత చెప్పినా ప్రజలు వినకపోవడంతో విరక్తి చెందిన ఓ హోంగార్డు వినూత్నంగా విజ్ఞప్తి చేశారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో విధులు నిర్వర్తించే హోంగార్డు కృష్ణాసాగర్‌ అనవసరంగా ద్విచక్రవాహనాలపై బయటకు వచ్చిన యువతను నిలిపి పోలీసులకు సహకరించాలని కోరారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు అందరి మంచి కోసమేనని గుర్తించాలని.. ‘మీకు దండం పెడతా బయటకు రాకండయ్యా బాబూ’ అంటూ సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో యువకులు ఇకముందు అనవసరంగా బయటకు రామంటూ పోలీసులకు హామీ ఇచ్చారు.