Widgets Magazine

ఫలక్‌నుమా ప్యాలెస్‌ విందు.. 12 రకాల బిర్యానీలు... విందులో హీరో భార్య...

హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017 మంగళవారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు ప్రారంభించారు.

biryani
pnr| Last Updated: బుధవారం, 29 నవంబరు 2017 (10:21 IST)
హైదరాబాద్‌లో ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు 2017 మంగళవారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌లు ప్రారంభించారు. ఈ సదస్సు ప్రారంభం తర్వాత నరేంద్ర మోడీ, ఇవాంకాలు ప్రసంగించారు. ఆ తర్వాత సదస్సుకు వచ్చిన విదేశీ ప్రతినిధులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విందు ఇచ్చింది.
హైదరాబాద్‌లోని చరిత్రాత్మకమైన ఫలక్‌నుమా ప్యాలెస్‌ హోటల్‌‌లో విశాలమైన డైనింగ్‌హాల్‌లో ఈ విందు ఏర్పాట్లుచేశారు. హోటల్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డైనింగ్ టేబుల్‌పై ఏకకాలంలో 101 మంది ఆసీనులై విందు ఆరగించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు కోసం విచ్చేసిన దేశ, విదేశీ అతిథులు మంగళవారం సాయంత్రం నిజాం కాలం నాటి రుచులను రుచిచాశారు.

ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా, గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, సుష్మా స్వరాజ్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కలిసి భోంచేశారు. విఖ్యాత డైనింగ్‌ టేబుల్‌పై విందు ఆరగించినవారిలో వ్యాపార దిగ్గజాలు రతన్‌టాటా, ముఖేశ్‌ అంబానీ, ఆది గోద్రేజ్‌, కుమారమంగళం బిర్లాతో పాటు తెలుగు టాలీవుడ్ హీరో రాంచరణ్ భార్య ఉపాసన, శోభనా కామినేని, అపోలో ప్రతాప్‌రెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు.

ఈ విందులో ఏకంగా 12 రకాల బిర్యానీలు వడ్డించారు. ముఖ్యంగా, హైదరాబాదీ ప్రత్యేక వంటకం బిర్యానీని 12 విభిన్న రుచుల్లో వండివార్చారు. చికెన్‌, మటన్‌ ధమ్‌కి బిర్యాని, షీప్‌ కబాబ్‌, మటన్‌ ముర్గ్‌, మొఘలాయి మటన్‌, జింజర్‌ చికెన్‌, కుర్‌బానీకా మీఠా, డ్రైఫ్రూట్స్‌ కీర్‌, బగారా బైంగన్‌ తదితర వంటకాలు ఉన్నాయి. అలాగే, హైదరాబాద్‌ దక్కనీ సంప్రదాయ నవాబు వంటకాలు, భారతీయ శాకాహార, మాంసాహార వంటకాలు సహా చైనీస్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, కరీబియన్‌ వంటకాలను మొత్తంగా 250పైగా వెరైటీలను తయారు చేశారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌ హోటల్‌ ప్రధాన చెఫ్‌ సంజేశ్‌ నాయర్‌ నేతృత్వంలో ఈ వంటకాలను తయారు చేశారు. ఈ వంటకాలను అతిథులు అమితంగా ఆరగించేందుకు ఇష్టపడ్డారు.


దీనిపై మరింత చదవండి :