బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (14:26 IST)

తెలంగాణాలో మరోమారు పర్యటించనున్న ప్రధాని మోడీ

modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు. వరంగల్‌లో కొత్తగా నిర్మించిన టెక్స్‌టైల్ పార్కును ప్రారంభించేందుకు ప్రధాని మోడీ వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్న ప్రధాని మోడీ, సోమవారంతో తన ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకోన్నారు. ఆ మరుసటి రోజు అంటే మంగళవారం ఆయన తెలంగాణ పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. 
 
కాగా, గత నెలలో ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఏప్రిల్ 8వ తేదీన సికింద్రాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలును ఆయన ప్రారంభించారు. ఇందుకోసం ఆయన సికింద్రాబాద్‌కు వచ్చారు. అదే రోజున ఆయన పలు అభివృద్ధి పథకాలకు కూడా శంకుస్థాపనలు చేశారు. ఇపుడు మరోమారు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.