గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (17:48 IST)

అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా.. ఐసీయూలో చికిత్స

Anil kumar yadav
తెలంగాణ కాంగ్రెస్‌ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. గత రెండు రోజులు‌గా అస్వస్థతకు గురైన అంజన్ కుమార్ యాదవ్… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
 
అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. పాజిటివ్‌‌గా నిర్ధారణ కావడమే కాదు… ఆయన పరిస్థితి కూడా చాలా సీరియస్‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను ఐసీయూ వార్డు ఉంచారని సమాచారం అందుతోంది.
 
జూబ్లీహిల్స్‌‌లోని అపోలో ఆస్పత్రిలో అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో… ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారని తెలుస్తోంది. ఇక అంజన్ కుమార్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరా తీసినట్లు సమాచారం.