సమతామూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(photos)
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో కొలువై వున్న వివిధ దేవతామూర్తులను సందర్శించారు. సమతామూర్తి విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. రామానుజాచార్యులవారి వైభవాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.