గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (18:06 IST)

నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. ప్రయాణీకులకు తీవ్రగాయాలు

nallamala forest
నల్లమల ఘాట్ రోడ్డులో ఏర్పడిన ప్రమాదం కారణంగా పలువురు ప్రయాణీకులు తీవ్రగాయాలకు గురైయ్యారు. నల్లమల ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో చాలామంది ప్రయాణీకుల చేతులకు, కాళ్లకు గాయాలైనాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రమాద సమయంలో బస్సులో 20 మందికి పైగా ప్రయాణీకులు వున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి శ్రీశైలం బస్సు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.